Take a fresh look at your lifestyle.

49 కిలోమీటర్ల మేర రోడ్లకు మహర్దశ 130 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు ఫలించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి ల కృషి

 

ముద్ర ప్రతినిధి , కోదాడ …..

కోదాడ , హుజూర్ నగర్ నియోజక వర్గాలలో పలు రహదారులకు మహర్దశ పట్టింది. సింగిల్ లైన్ రహాదారులుగా ఉన్న 49 కిలో మీటర్ల రహదారిని డబుల్ రోడ్లుగా చేసేందుకు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు గాను పాలనా పరమైన అనుమతులతో పాటు , ప్రభుత్వం ఏక కాలంలో మేజర్ డిస్ట్రిక్ రోడ్ ప్లాన్ (ఎం డి ఆర్) కింద 130 కోట్ల నిధులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది వాటి వివరాలు ఇలా ఉన్నాయి …. కోదాడ నియోజకవర్గం పరిధిలో రూ.30 కోట్లతో కోదాడ నుండి అనంతగిరి వరకు 6.60 కిమీ ల మేర ఏడు మీటర్ల నుండి పది మీటర్ల మేర వెడల్పుతో రోడ్డు నిర్మాణం చేయనున్నారు. దీనితో కోదాడ, ఖానాపురం, అనంతగిరి గ్రామాల ప్రజలకు లబ్ధి చేకూరుతుంది.
రూ.24 కోట్లతో నేషనల్ హైవే 65 నుండి నేలమర్రి వరకు 10 కిమీ ల మేర సింగిల్ లైన్ నుండి డబల్ లైన్ రోడ్డు నిర్మాణం చేయనున్నారు. దీనితో తాడ్వాయి తండ, తాడ్వాయి, వెంకట్రాంపురం, నేలమర్రి గ్రామాల ప్రజలకు లబ్ధి చేకూరుతుంది.
అదే విదంగా రూ.14 కోట్లతో కాపుగల్లు నుండి దోరకుంట వరకు 6 కిమీ మేర సింగిల్ లైన్ నుండి డబల్ లైన్ రోడ్డు నిర్మాణం చేయనున్నారు. దీనితో కాపుగల్లు, దోరకుంట ప్రజలకు లబ్ధి చేకూరుతుంది. ఇక హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలో రూ.62 కోట్లతో 26.50 కిమీ ల డబల్ రోడ్డు మంజూరు పనులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. తద్వారా ఈ నియోజకవర్గంలో 15 గ్రామాలకు ప్రయాణ సౌకర్యం సులువుగా మారనుంది. రూ.32 కోట్లతో చింతలపాలెం నుండి కిష్టాపురం వరకు 9.20 కిమీ ల మేర సింగిల్ లైన్ నుండి డబల్ లైన్ రోడ్డు నిర్మాణం చేయనున్నారు. దీనితో చింతలపాలెం, శోభనాద్రిగూడెం, అడ్లూరు, తమ్మారం, కొత్తూరు, కిష్టాపురం గ్రామ ప్రజలకు లబ్ధి చేకూరుతుంది. అదేవిధంగా రామలక్ష్మిపురం నుండి హుజూర్ నగర్ బైపాస్ రోడ్డు వరకు 3.80 కిమీ ల మేర సింగిల్ లైన్ నుండి డబల్ లైన్ రోడ్డు నిర్మాణం చేయనున్నారు. దీనితో రామలక్ష్మిపురం, యర్రారం , హుజూర్ నగర్ ప్రజలకు లబ్ధి చేకూరుతుంది.
రూ.30 కోట్లతో అమరవరం నుండి కొత్త తండ వరకు 5.50 కిమీ ల మేర సింగిల్ లైన్ నుండి డబల్ లైన్ రోడ్డు నిర్మాణం చేయనున్నారు. దీనితో అమరవరం, అంజలిపురం తండ, కొత్తతండ ప్రజలకు లబ్ధి చేకూరుతుంది. గుడుగుంట్ల పాలెం నుండి ఎల్లాపురం వరకు 8.00 కిమీ ల మేర సింగిల్ లైన్ నుండి డబల్ లైన్ రోడ్డు నిర్మాణం చేయనున్నారు. దీనితో గుడుగుంట్ల పాలెం, మూసి ఒడ్డు సింగారం, ఎల్లాపురం గ్రామాల ప్రజలకు లబ్ధి చేకూరుతుంది. ఇదే విషయమై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంబందిత అధికారులతో మాట్లాడుతూ తక్షణమే టెండర్లు పిలిచి యుద్ద ప్రాతిపదికన పనులు మొదలు పెట్టాలని ఆదేశించారు.

Leave A Reply

Your email address will not be published.