- జిడికె 2వ ఇంక్లైన్ లో జరిగిన గేట్ మీటింగ్ లో జేఏసీ సంఘాల నాయకులు.
ముద్ర ప్రతినిధి, గోదావరిఖని: సింగరేణి లో జూలై 9 న సార్వత్రిక సమ్మె చేసి కేంద్ర ప్రభుత్వ మెడలు వంచాలని సింగరేణి జేఏసీ సంఘాలైన ఏఐటియుసి, ఐఎన్టీయుసి,సిఐటియు, టిబిజికేఎస్,ఐఎఫ్టీయు నాయకులు మడ్డి ఎల్లా గౌడ్, ఆరెపెల్లి శ్రీనివాస్,మెండె శ్రీనివాస్, మిర్యాల రాజిరెడ్డి,కట్ట విశ్వనాథం లు కార్మికులకు పిలుపు నిచ్చారు. శుక్రవారం సింగరేణి ఆర్జీ వన్ ఏరియా లోని జిడికె 2వ ఇంక్లైన్ లో జరిగిన జేఏసీ సంఘాల గేట్ మీటింగ్ లో వారు పాల్గొనీ మాట్లాడుతూ కేంద్రం లోని బిజేపి ప్రభుత్వం కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్ లను విభజించడాన్ని వారు వ్యతిరేకించారు. ఇట్టి లేబర్ కోడ్ లు అమలు చేస్తే ఇప్పుడు పొందుతున్న సౌకర్యాలు, హక్కులు ఉండవని వారు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ తన కార్మిక,ప్రజా వ్యతిరేక విధానా లను,కార్పొరేట్ అనుకూల చర్యల ను పెంచి పోషిస్తుందని వారు విమర్శించారు.కార్మిక వర్గం సమర శీల పోరాటాల ద్వారా అనేక సంవత్సరాల నుండి సాధించు కున్న 44 కార్మిక చట్టాలలో 29 కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్ లను తీసుకొచ్చి అమలు చేసేందుకు ప్రయత్నిస్తుందని ఆరోపించారు. సింగరేణిలో కార్మికులతో పాటు కాంట్రాక్టు కార్మికులు కూడా తమ హక్కులను కాపాడుకునేందుకు జాతీయ స్థాయిలో కార్మిక సంఘాలు ఇచ్చిన సమ్మె పిలుపు ను సింగరేణి లో జూలై 9 న విజయవంతం చేయాలని వారు కార్మికులను కోరారు.ఈ సమావేశంలో జేఏసీ సంఘాల నాయకులు కవ్వంపల్లి స్వామి, ఆరెల్లి పోషం,రంగు శ్రీను,పొన్నాల వెంకటయ్య,గుండెటి శ్రీనివాస్, సిరిపురం నర్సయ్య, ఏ.శంకర్, యు.రాములు,వడ్డెపెల్లి శంకర్, ఉప్పులేటి తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
