Take a fresh look at your lifestyle.

తాండూర్ జిల్లా ఆసుపత్రిని తనిఖీ చేసిన కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి

 

ముద్ర, తాండూర్: వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలోని హైదరాబాద్ రోడ్డు మార్గంలో ఉన్న మాతా శిశు ఆసుపత్రిని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ లు ఆకస్మిక తనకి చేశారు. ఆస్పత్రిలో చిన్నారులకు, గర్భిణీ బాలింతలకు అందిస్తున్న సేవలపై రోగులను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా వైద్య సిబ్బందితో మాట్లాడుతూ ఆసుపత్రిలో గల సమస్యలను ఎదురవుతున్న ఇబ్బందులను, రోగులకు అందిస్తున్న వైద్య సేవలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆస్పత్రిలో నెలకొని ఉన్న సమస్యలపై తక్షణమే దృష్టి సారించడం జరుగుతుందని, ఆస్పత్రిలో ఉన్న లీకేజ్ సమస్యలను, డ్రైనేజీ వ్యవస్థ, తదితర మౌలిక సదుపాయాల కల్పనకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వారు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సుధీర్, మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజ బాల్రెడ్డి, వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్, డి సి హెచ్ ఎస్ డాక్టర్ ఆనంద్, సూపర్డెంట్ వినయ్ కుమార్, మాజీ కౌన్సిలర్ పట్లోళ్ల నర్సింలు, కౌన్సిలర్ జావిద్, ప్రభాకర్ గౌడ్, బంటు మల్లప్ప, జుబేర్ లాల, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.