Take a fresh look at your lifestyle.

ఘనంగా మహావీర్ జయంతి వేడుకలు

 

ముద్ర : మల్కాజిగిరి

సికింద్రాబాద్‌లోని ఇంపీరియల్ గార్డెన్‌లో శ్రీ మహావీర్ జైన్ సేవా సంఘ్ కోర్ కమిటీ సభ్యులు నిర్వహించిన భగవాన్ మహావీర్ 2625వ జన్మ కళ్యాణక్ మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామ్ చందర్రావు , మల్కాజ్‌గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటెల రాజేందర్, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి హాజరయ్యారు .
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, భగవాన్ మహావీర్ బోధనలు రెండు వేల సంవత్సరాలకు పైగా మానవాళికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. “జీయో ఔర్ జీనే దో ‘ అనే మహావీర్ సందేశం సమాజంలో శాంతి, సామరస్యానికి పునాది అని తెలిపారు. విభిన్నతలతో కూడిన సమాజంలో పరస్పర గౌరవం, సహనం అత్యంత అవసరమని అన్నారు.
“అహింసా పరమో ధర్మం” అనే జైన సిద్ధాంతం కేవలం హింస చేయకపోవడం మాత్రమే కాకుండా, ప్రతి జీవిపై కరుణ చూపించే గొప్ప జీవన విధానమని వివరించారు. సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుండే శ్రీ మహావీర్ జైన్ సేవా సంఘ్ నిర్వహిస్తున్న ధార్మిక, సేవా కార్యక్రమాలు ప్రశంసనీయమని కొనియాడారు.
మల్కాజ్‌గిరి , సికింద్రాబాద్ ప్రాంతాల్లోని జైన్ సమాజం స్థానిక ఆర్థికాభివృద్ధికి తోడ్పడటమే కాకుండా, సామాజిక విలువలకు మార్గదర్శకులుగా నిలుస్తోందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మహావీర్ జైన్ సేవా సంఘ్ కోర్ కమిటీ సభ్యులు ప్రదీప్ సురానా, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.