Take a fresh look at your lifestyle.

కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారంలో పాల్గొన్న ఆర్బిఎల్ సీఈవో శ్రీనివాస్ రెడ్డి

 

తాండూర్. ( ముద్ర): వికారాబాద్ జిల్లా తాండూర్ మున్సిపల్ పరిధిలోని 27వ వార్డ్, 36వ వార్డ్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులకు మద్దతుగా ఇంటింట ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్బిఎల్ సీఈవో శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి తాండూర్ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు. 27వ వార్డ్ కౌన్సిలర్ అభ్యర్థి స్వరూప మల్లేశం, 36 వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి కల్వ సిరి చందన తరపున ఇంటింటి ప్రచారం నిర్వహించి, గత రెండు సంవత్సరాల కాలంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఎన్నో నిధులు తీసుకొని వచ్చి మున్సిపల్ పరిధిలో సిసి రోడ్లు, డ్రైనేజ్ సమస్య, త్రాగునీటి ఎద్దడి, చిలుక వాగు పనులు, ఎన్నో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టాడని, కావున మీరు వేసే ఓటు వృధా కాకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపిస్తే ఇంతకన్నా రెట్టింపు అభివృద్ధి చేసి చూపిస్తారని అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు జుబేర్ లాల, ఉప్పరి మల్లేశం, చంద్రశేఖర్ గౌడ్, జగదీశ్వర్, పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.