ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్:
తెలంగాణ నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో ఈనెల 12న మంగళవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు స్వచ్ఛంద రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ టి. ఉషారాణి తెలిపారు.
ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో ప్రతిరోజూ జరిగే డెలివరీలు, ఆర్థోపెడిక్ శస్త్రచికిత్సలు, సాధారణ సర్జరీలు, రక్తహీనతతో బాధపడుతున్న రోగులకు అవసరమయ్యే రక్తం కోసం ఈ ప్రాంత యువత, స్వచ్ఛంద సంస్థల సభ్యులు, నాయకులు, అధికారులు ముందుకు వచ్చి రక్తదానం చేయాలని ఆమె కోరారు.
రక్తదానం చేయదలచిన వారు వివరాల కోసం బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఎ. రోహిత్ (9160120821), నర్సింగ్ ఆఫీసర్ ఎం. ఆనంద్ (98850 46683), హెల్ప్ డెస్క్ ఇంచార్…