Take a fresh look at your lifestyle.

బెదిరింపులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్…. బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్….

 

కోరుట్ల, ముద్ర;
గత కొంతకాలంగా కోరుట్ల పట్టణంలోని వ్యాపారవేత్తలను చంపుతానని బెదిరిస్తూ బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్న విత్తనాల నాగరాజు అను రౌడీ షీటర్ ని, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు, మెట్టుపల్లి డి.ఎస్.పి ఏ రాములు ఆధ్వర్యంలో, మంగళవారం రోజు కోరుట్ల పట్టణంలో అరెస్టు చేసి రిమాండ్ కు తరలించడం జరిగింది.

ఈ సందర్భంగా సీఐ సురేష్ బాబు మాట్లాడుతూ గతంలో కూడా విత్తనాల నాగరాజు పై రెండు మర్డర్ కేసులు, ఎక్స్ట్రాక్షన్ కేసులు నమోదు చేసినట్లు, గతంలో పీడీ యాక్ట్ నమోదు చేసి జైలుకు పంపినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో విత్తనాల నాగరాజు తో పాటు మరొక నిందితుడు కూడా ఉన్నట్లు ఆ దర్యాప్తులో తేలింది. ప్రస్తుతం అతను పరారీలో ఉన్నాడు. అతనిని తొందర్లోనే పట్టుకుని అరెస్టు చేస్తామన్నారు. వీరిద్దరే కాకుండా ఇంకా ఎవరైనా ఉంటే కూడా వారిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కేసుని చాలా మైనేట్ గా దర్యాప్తు చేస్తున్నాం. అదేవిధంగా నాగరాజు ఇతని సహచరులతో ఎవరైనా సంబంధాలు కలిగి అతనితో కలిసి తిరిగిన ప్రతి ఒక్కరిపై ప్రత్యేక నిగా పెట్టి వారి పైన కూడా కఠిన చర్యలు తీసుకోబడును. ఎవరైనా ఎవరినైనా ఇలాంటి బెదిరింపులకు పాల్పడి బలవంతపు వసూలు చేస్తే వారిపై చట్టపరంగా చాలా కఠిన చర్యలు తీసుకోబడును. కోరుట్ల పట్టణ, పరిసర గ్రామ ప్రజలందరికీ ఎవరైనా ఎవరైనా భయభ్రాంతులకు గురిచేసిన బెదిరించిన నిర్భయంగా పోలీసు వారికి సమాచారం ఇవ్వవచ్చు అదేవిధంగా మీ వివరాలు చాలా గోప్యంగా ఉంచబడతాయని సీఐ సురేష్ బాబు, ఎస్సై చిరంజీవి పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.