బోడుప్పల్, ముద్ర ప్రతినిధి:
మల్కాజ్గిరి నగర పాలకసంస్థ పరిధిలోని బోడుప్పల్ సర్కిల్ లో రోడ్డుపక్కన పాడై వదిలేసిన వాహనాలను తొలగించే కార్యక్రమం అధికారులు మొదలుపెట్టారు. మల్కాజ్గిరి నగర పాలక సంస్థ కమిషనర్ ఆదేశాల మేరకు బోడుప్పల్ సర్కిల్ “100 రోజుల ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమము” లో భాగముగా సోమవారం రోడ్డు పక్కన పడి వున్న పాడైన వాహనాములను ట్రాఫిక్ పోలీస్ వారి సహాయముతో గుర్తించడం జరిగినది. అనంతరం గుర్తించిన పది పాడై రోడ్డు పక్కన వున్న వాహనాములను డిప్యూటీ కమిషనర్ ఎ. శైలజ ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ తో కలిసి మేడిపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ కార్యక్రమం లో శానిటరీ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్, ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది, మునిసిపల్ సిబ్బంది పాల్గొన్నారు.