ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి :
వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రాలను జిల్లా కలెక్టర్ దీపక్ తివారి ఆకస్మికంగా సందర్శించారు. ఈసందర్బగా పిల్లలు ఎంత మంది ఉన్నారు, శ్యామ్ మ్యామ్ పిల్లలు ఎంత మంది ఉన్నారని వివరాలు అడిగి తెలుసుకున్నారు. శ్యామ్ మ్యామ్ పిల్లల ఆరోగ్య పరిస్థితిపై ద్రుష్టి సారించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కేంద్రాలలో పిల్లలకు అందిస్తున్న పోషకాహారం, ప్రీ-స్కూల్ విద్యా కార్యక్రమాలు, హాజరు నమోదు పుస్తకాలు, భద్రతా ప్రమాణాలు తదితర అంశాలను పరిశీలించారు.

కలెక్టర్ పిల్లలతో ముచ్చటించి వారికి అందిస్తున్న ఆహారం నాణ్యతపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజన సమయంలో పిల్లలతో పాటు కలెక్టర్ భోజనం చేశారు. గర్భిణీ స్త్రీలు, బాలింతలకు అందిస్తున్న సప్లిమెంటరీ పోషకాహారంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అంగన్వాడీ సిబ్బందికి పలు సూచనలు చేస్తూ, పిల్లల ఆరోగ్యం శుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు. ప్రీ-స్కూల్ విద్యా కార్యక్రమాలను మరింత మెరుగుపరచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శిశు సంక్షేమ అధికారిణి కృష్ణ వేణి, సూపర్ వైజర్ జయశ్రీ, నిర్మల, అంగన్వాడి టిచర్ లు, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.