Take a fresh look at your lifestyle.

భువనగిరిలో పేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ కానుక

ముద్ర, భువనగిరి ప్రతినిధి :

పవిత్రమైన రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని భువనగిరి పట్టణ,మండల పరిధిలోని నిరుపేద ముస్లిం కుటుం బాలకు గురువారం మేరాజ్ గ్రూప్,ఆఫ్ హైదరాబాద్ సౌజన్యంతో “రంజాన్ తోఫా” పేరుతో నిత్యవసర సరుకులను పంపిణీ చేశారు. జిల్లా కేంద్రంలోని ఇస్లాంపూర్ మసీదు,వద్ద ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని జిల్లా మైనార్టీ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు, నేషనల్ జిల్లా అధ్యక్షుడు,వక్ఫ్ బోర్డు ఆఫీషియల్ మెంబర్ ఎండి,ఇంతియాజ్ అహ్మద్ ఆధ్వర్యంలోనిర్వహించగా .ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా,సబ్ కలెక్టర్ కృష్ణారెడ్డి,మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పోతంశెట్టి మంజుల, తహసీల్దార్ సేకూరి జగన్, ప్రముఖ,అడ్వకేట్ సామ రాజేందర్ రెడ్డి,మౌలానా బఖియతుల్లాహ్ లు హాజరై పేద,ముస్లిం కుటుంబాలకు నిత్యవసర సరుకులను అందజేశారు. ఈ కార్యక్రమంలో దాతలు రయీద్ ఖాన్, ఉబయ్ ఖాన్, మైనార్టీ వెల్ఫేర్ సొసైటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సయ్యద్ రఫీఖ్, రాష్ట్ర సహాయ కార్యదర్శి కామ్రాన్ హుస్సేన్, కార్యదర్శి సయ్యద్ రేయ్యాన్, అదిల్ వసీమ్, మౌలానా బాఖియ తుల్లాహ్ ఎండీ మొఖ్తార్ అహ్మద్, రిదా మరియం, కాఏర, నాజ్, ఆదిల్, రషీద్ వసీమ్ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.