Take a fresh look at your lifestyle.

పద్మశాలిల ఆషాడ మాస బోనాలు 

కోరుట్ల, ముద్ర విలేకరి: శ్రీ శివ మార్కండేయ కోటి నవదుర్గ దేవాలయం కోరుట్లలో ఆషాడ మాస సందర్భంగా బోనాల కార్యక్రమం ను పద్మశాలి కులోన్నతి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అంగ రంగ వైభవంగా నిర్వహించారు. “ఆషాడ బోనం అమ్మకు అత్యంత ప్రియం” అని ఆలయ అర్చకులు అన్నారు. పెద్ద ఎత్తున సంఘ మహిళలు బోనం ఎత్తుకొని ఊరేగింపుగా  బయలుదేరి కోరుట్ల పట్టణంలోని శ్రీ శివ మార్కండేయ కోటి నవదుర్గ దేవాలయంలో అమ్మ వారికి  తమ తమ బోనాలు సమర్పించుకున్నారు.ఉత్సవంలో శివసత్తులు, పోతురాజులు వివిధ కళాకారుల వేషధారణలు పలువురిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్ష, కార్యదర్శులు కార్యవర్గం, పద్మశాలి రాష్ట్ర, జిల్లా నాయకులు, పుర ప్రముఖులు, వ్యాపారస్తులు, మహిళలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.