Take a fresh look at your lifestyle.

నల్లగొండలో రైతు సభ పేరుతో కామెడీ షో నిర్వహించిన కేటీఆర్….. భువనగిరి ఎంపీ చామల ఆరోపణ

ఆలేరు. ముద్ర:- మంగళవారం నాడు బిఆర్ఎస్ పార్టీ కార్యనిర్వహక అధ్యక్షులు కేటీఆర్ నల్లగొండలో నిర్వహించింది రైతు సమకాదని కామెడీ షో అని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. బుధవారం నాడు ఆలేరు ముద్ర ప్రతినిధితో మాట్లాడుతూ నల్లగొండలో కేటీఆర్ రైతు ధర్నా పూర్తిగా వైపల్యం చెల్లిందని అన్నారు. వజ్ర నుండి కనీస మద్దతు కేటీఆర్ కు లభించలేదని చెప్పారు. బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా కార్యక్రమానికి స్పందించలేదని అన్నారు. కేటీఆర్ నిర్వహించిన రైతు ధర్నా కార్యక్రమానికి రైతులనుంది మద్దతు కొరవడిందని చెప్పారు. కేటీఆర్ తన వ్యక్తిగత ప్రతిష్టను పెంచుకునేందుకే ఈ కార్యక్రమాన్ని నిర్వహించారని ఆరోపించారు. రాష్ట్రంలో గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంతో పోలిస్తే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు సంతోషంగా ఉన్నారని చెప్పారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా, సన్న ధాన్యానికి బోనస్, ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో రైతులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని తెలిపారు.

21 వేల కోట్ల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని అన్నారు. రైతు భరోసా సహాయాన్ని ఏడాదికి పదివేల నుండి 12 వేలకు పెంచామని చెప్పారు. రైతు భరోసా సహాయం రైతుల ఖాతాలలో జమ చేస్తున్నామని తెలిపారు. మొదటి రోజునే రాష్ట్ర ప్రభుత్వం 569 కోట్ల రూపాయలను రైతుల ఖాతాలలో జమ చేశామని వివరించారు. తెలంగాణలోని 32 జిల్లాలలో 563 గ్రామాలకు చెందిన 4.41, 9011 మంది రైతులకు ఎకరానికి తోలి విడతగా 6000 రూపాయల చొప్పున పంట పెట్టుబడి సహాయం అందించామని అన్నారు. ఒక్క రోజులోనే మొత్తం 569 కోట్లను రైతుల ఖాతాలలో జమ చేసి, మొదటి రోజున 9.48,3 00 ఎకరాల విస్తీర్ణంలో గల భూములకు రైతు భరోసా చెల్లించామని వివరించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మొదటి రోజు దాదాపు 100 కోట్లకు పైగా రైతు భరోసా నిధులను రైతులకు ఖాతాలలో జమ చేయడానికి నిరసిస్తూనే కేటీఆర్ నల్లగొండలో రైతు ధర్నా నిర్వహించారని ఆరోపించారు. 18, 180 వ్యవసాయ కూలీలకు మొదటి రోజు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద 10.01 కోట్లను విడుదల చేశామని తెలిపారు. ఇన్ని కోట్ల రూపాయలను ఖర్చు చేస్తుంటే కేటీఆర్ కల్లుండి చూడలేని ప్రబోధిగా మారి ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం తగదని అన్నారు. కేటీఆర్ వెంటనే తన అసత్యపు ఆరోపణలను మనుకోవాలని సూచించారు. లేకుంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు…..

Leave A Reply

Your email address will not be published.