Take a fresh look at your lifestyle.

‘ఆపరేషన్ కగార్’ ఆపండి, ఆదివాసీలను బతకనివ్వండి

  • కేంద్రం రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలి.
  • కర్రెగుట్టపై అక్కడి ప్రజలు జీవనాధారం కోల్పోయారు.
  • కేంద్ర బలగాల ఆంక్షలతో ఆదివాసీల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది.
  • రాష్ట్ర పంచాయత్​ రాజ్​ శాఖ మంత్రి సీతక్క.

ముద్ర, తెలంగాణ బ్యూరో : ఆపరేషన్ కగార్ విషయంలో కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగబద్దంగా వ్యవహరించాలని రాష్ట్ర పంచాయత్​ రాజ్​ శాఖ మంత్రి సీతక్క డిమాండ్ చేశారు.కర్రెగుట్టల్లో కేంద్ర బలగాల ఆంక్షలతో ఆదివాసీల మనుగడ ప్రశ్నార్థకం అవుతుందని వ్యాఖ్యానించారు.సీఆర్‌పీఎఫ్ దళాలు కర్రిగుట్టపై పర్మినెంట్ బేస్ క్యాంపులను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు మొదలు పెట్టాయి.ఈ అంశంపై గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు.కర్రెగుట్టపై అక్కడి ప్రజలు జీవనాధారం కోల్పోయి.కుటుంబాలు గడవని పరిస్థితులు ఏర్పాడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రింబవళ్లు కాల్పులతో అక్కడి జనం భయబ్రాంతులకు గురవుతున్నారన్నారు. ఆపరేషన్ కగార్’‌ను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు.మావోయిస్టులతో కేంద్రం శాంతి చర్చలు జరపాలని.. ఆదివాసీల జీవనానికి ఇబ్బంది లేకుండా చూడాలి సీతక్క కోరారు.ఇదీలావుంటే తెలంగాణ – ఛత్తీస్‌గడ్‌ సరిహద్దుల్లో ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ఆపరేషన్ కగార్ విషయంలో కేంద్ర ప్రభుత్వం పట్టు వీడే పరిస్థితులు కనిపించడం లేదు. దాదాపు 20వేల భద్రతా సిబ్బంది కర్రిగుట్టల్లో మావోయిస్టు అగ్రనేతలు, దళ సభ్యుల కోసం జల్లెడ పడుతున్నారు. ఇప్పటికే ఆ ఆపరేషన్‌లో భాగంగా కర్రిగుట్టపై సీఆర్‌పీఎఫ్ దళాలు జాతీయ జెండాను ఎగురువేశారు. అక్కడే పర్మినెంట్ బేస్ క్యాంపులు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు మొదలు పెట్టాయి.ఈ క్రమంలో కర్రిగుట్ట పరధిలోని దోబికొండ, నీలం సరాయి గుట్టలు పూర్తి స్థాయిలో తమ ఆధీనంలోకి వచ్చినట్లుగా ఉన్నతాధికారులు గురువారం ప్రకటించారు.

Leave A Reply

Your email address will not be published.