Take a fresh look at your lifestyle.

నెత్తురోడిన సాగర్ రహదారి

  • కారును ఢీకొన్న ట్రావెల్స్ బస్సు.
  • ముగ్గురు యువకుల మృతి.. మరో ముగ్గురి తీవ్ర గాయాలు.

ఇబ్రహీంపట్నం, ముద్ర విలేకరి: యాచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని మాల్ గ్రామ సాగర్ రహదారి నెత్తురోడింది. మంగళవారం అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ముగ్గురు యువకులను బలితీసుకుంది. ట్రావెల్స్ బస్సు ఎదురుగా వస్తున్న కారును ఢీకొన్న ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ సంఘటనకు సంబంధించి వివరాలు.. నగరంలోని బాలానగర్‌కు చెందిన వాస సాయితేజ (22), మూసాపేట్‌కు చెందిన వాస పవన్ కుమార్ (25), రాఘవేందర్ (25) లు మరో నలుగురు స్నేహితులతో కలిసి నాగార్జున సాగర్ దగ్గరున్న వైజాగ్ కాలనీకి వెళ్లారు. అర్ధరాత్రి 1:30 గంటల ప్రాంతంలో తిరిగు ప్రయాణంలో నగరానికి వస్తుండగా మాల్ సమీపంలోని మైసమ్మ దేవాలయం సమీపంలోని ఎస్సార్ పెట్రోల్ బంకు వద్దకు చేరుకోగానే నాగార్జునసాగర్ వైపు వెళ్తున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఎదురుగా వచ్చి కారును బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో పవన్ కుమార్, సాయితేజ, రాఘవేందర్ లు అక్కడిక్కడే మృతి చెందారు. వాస శివకుమార్, వాస సాయికుమార్, ఎం సందీప్, శివ కుమార్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వారిని చికిత్స కోసం నగరంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న యాచారం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.