Take a fresh look at your lifestyle.

జిల్లాలోని చేనేత కార్మికులకు నేటి నుంచి మే 13 వరకు ప్రత్యేక వైద్య శిబిరాలు : జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి :
జిల్లాలోని చేనేత కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని నేటి నుండి మే 13 వరకు ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 10,323 మంది చేనేత కార్మికులు నివసిస్తున్నారని ఆయా మండలాలు, గ్రామాలలో నేటి నుండి ఆరోగ్య శిబిరాలను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని అన్నారు.
ఈ ఆరోగ్య శిబిరాలలో ప్రభుత్వ వైద్యులు జనరల్ ఫిజీషియన్, ఆఫ్తమాలజిస్ట్ (కంటి వైద్యుడు), ఆర్థోపెడిషియన్ (ఎముకల వైద్యుడు) పాల్గొని చేనేత కార్మికులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులు అందజేస్తారని చెప్పారు.
ఈ శిబిరాలలో చేనేత కార్మికులకు రక్తపోటు (బీపీ) పరీక్షలు, షుగర్ పరీక్షలు, కంటి పరీక్షలు, ఎముకల సమస్యల నిర్ధారణతో పాటు వివిధ దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలకు సంబంధించిన పరీక్షలు నిర్వహించి వ్యాధుల తీవ్రతను బట్టి రిఫరల్ హాస్పటల్ తీసుకొని వెళ్లడం జరుగుతుందన్నారు.
శిబిరాల సమయం
ప్రతి రోజు ఉదయం 9:00 గంటల నుండి సాయంత్రం 5:00 గంటల వరకు ఉంటుందని తెలిపారు.
16న ఆలేరు మండలం గౌడ సంఘంలో,
17-న ఆత్మకూరు మండలం పీహెచ్సీలో, 18న యూపీహెచ్సీ భువనగిరిలో,
20 నుండి 23 వరకు చౌటుప్పల్, కొయ్యలగూడెం, కుంట్లగూడెం ప్రాంతాలు,
24న పీహెచ్ సీ మోటకొండూరు,
25న పీహెచ్ సీ మోత్కూర్,
27 నుండి మే 2 వరకు పోచంపల్లి సొసైటీ డైయింగ్ హౌస్,
04న పీహెచ్ సీ రాజాపేట,
05, 06న – పీహెచ్ సీ
రామన్నపేట,
07న పీహెచ్ సీ
వలిగొండ,
08న పీహెచ్ సీ
యాదగిరిగుట్ట,
11న పీహెచ్ సీ గుండాల,
12న పీహెచ్ సీ నారాయణపూర్,
13న పుట్టపాక క్లస్టర్ బిల్డింగ్ లో జరుగుతాయన్నారు. జిల్లాలోని చేనేత కార్మికులు, వారి కుటుంబ సభ్యులు ఈ ఆరోగ్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Leave A Reply

Your email address will not be published.