Take a fresh look at your lifestyle.

గడి బురుజుల భూముల కబ్జాలపై జిల్లా కలెక్టర్ కు పిర్యాదు

 

ప్రజావాణిలో విఎల్టిలను రద్దు చేయాలని కోరిన అఖిలపక్ష, ప్రజాసంఘాల నాయకులు….

కోరుట్ల, ముద్ర;
కోరుట్ల పట్టణంలోని చారిత్రాత్మక చరిత్ర కలిగిన గడి బురుజులు మరియు వాటి పరిసర ప్రాంతాల్లో ఉన్న గ్రామ కంఠం, ఆబాదీ భూములపై అక్రమ కబ్జా ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ గడి బురుజుల పరిరక్షణ సమితి, మరియు అఖిలపక్ష ప్రజాసంఘాల ఐక్యవేదిక నాయకులు సోమవారం రోజు ప్రజావాణి లో జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.

ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం, గడి బురుజుల చుట్టుపక్కల ఉన్న ఖాళీ భూములను లక్ష్యంగా చేసుకుని కొందరు భూ మాఫియా వ్యక్తులు నకిలీ దస్తావేజులు సృష్టించి, అనుమానాస్పద వీఎల్టీల ఆధారంగా ఆ భూములను వ్యక్తిగత ఆస్తులుగా మార్చే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. గతంలో పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఇకనైనా తమరు వాటిని రద్దు చేయాలని కోరగా జిల్లా అదనపు కలెక్టర్ బి. రాజ గౌడ్ కోరుట్ల కమీషనర్ ను పిలిచి ఏమైనా ఆనాలోచనలు జరిగినట్లయితే వేంటనే రద్దు చేయాలని ఆదేశించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గడి బురుజుల ప్రాంతాన్ని ప్రజా ప్రయోజనాలకు ఉపయోగించేలా కూరగాయల మార్కెట్, పార్కు ఏర్పాటు, గడి బురుజులలో ఉన్న మైసమ్మ ఆలయాన్ని అభివృద్ధి చేయాలని, అలాగే కోనేరును పునరుద్ధరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అలా కానీ పక్షంలో పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలు చేపడతామని నాయకులు స్పష్టం చేశారు. పేట భాస్కర్, మహమ్మద్ ముజాహిద్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.