- ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి.
ముద్ర ప్రతినిధి కల్వకుర్తి : ధాన్యాన్ని నాణ్యత పేరుతో వ్యాపారులు రైతులను ఇబ్బందుల కు గురిచేస్తే వారిపై చర్యలు తీసుకుంటామని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. గురువారం అదనపు కలెక్టర్ అమరేందర్ తో కలిసి పట్టణంలోని రైస్ మిల్లులను ఆకస్మిక తనిఖీ చేశారు. మిల్లుల వద్ద వ్యాపారులు రైతులను మోసం చేస్తున్నారంటూ రెండు రోజుల క్రితం రైతులు ధాన్యానికి నిప్పంటించి నిరసన తెలుపడంతో ఎమ్మెల్యే అధికారులతో కలిసి ఆకస్మిక తనిఖీ Krne అక్కడున్న రైతులతో సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రైతులు నాణ్యమైన ధాన్యాన్ని తెచ్చి గిట్టుబాటు ధర పొందాలని సూచించారు.నాణ్యమైన ధాన్యానికి సైతం తరుగు పేరుతో రైతులను మోసం చేయడానికి ప్రయత్నిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నందున రైతులను ఇబ్బంది పెట్టకుండా వారికి సహకరించాలని వ్యాపారులకు సూచించారు. నిబంధన ప్రకారం వ్యాపారులు రైతులు తెచ్చిన ధాన్యాన్ని దించుకోవాలని తెలిపారు.