Take a fresh look at your lifestyle.

బడుగు బ్రతుకులకు వెలుగు జ్యోతి బాపూలే గ్రంథాలయ చైర్మన్ కోట రాజబాబు

 

మహాదేవపూర్, ముద్ర:

దళిత బహుజన జాతులలో వెలుగు నింపాలని ఆకాంక్షించి అందుకు మహాత్మా జ్యోతిరావు పూలే దంపతులు తమ జీవితాలను పరిత్యాగం చేసి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారని జిల్లా గ్రంథాలయ చైర్మన్ కోటరాజు బాబు అన్నారు. సర్పంచ్ హసీనా భాను అక్బర్ ఖాన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జ్యోతిరావు పూలే నిన్న వర్గాల అభివృద్ధిని కోరుకుని యావత్ సమాజాని మార్గదర్శకుడయ్యారని పేర్కొన్నారు. పేదలు, బలహీన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన సేవలను గుర్తు చేస్తూ, ప్రతి ఒక్కరూ విద్య ద్వారా అభివృద్ధి సాధించాలని సూచించారు. గ్రంథాలయాల ద్వారా జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని ఆయన వివరించారు.
సర్పంచ్ హసీనా భాను మాట్లాడుతూ జ్యోతిరావు పూలే సమాజంలో సమానత్వం కోసం, సామాజిక న్యాయం కోసం విద్య అనే ఆయుధంగా ఆయన చేసిన సేవలు ఎన్నటికీ మరువలేనివని పేర్కొన్నారు. ముఖ్యంగా మహిళల విద్యకు ఫూలే దంపతులు చేసిన కృషి ఆదర్శనీయమని, యువత ఆయన ఆలోచనలను అనుసరించాలనికోరారు. సహకార సంఘము మాజీ అధ్యక్షులు చల్ల తిరుపతిరెడ్డి ఉప సర్పంచ్ తుంగల శ్రీజ, పంచాయతీ కార్యదర్శి కల్పన, వార్డు సభ్యులు నల్లభూగ సమ్మయ్య, ఆస్రార్ ఖురేషి, మహమ్మద్ బిన్ అలీ, ఎండి నయిమొద్దీన్, గడ్డం వెంకటేశ్వర స్వామి, మాజీ ఎంపీపీ రాణిబాయి, మాజీ ఎంపీటీసీ సుధాకర్, మాజీ సహకార సంఘం చైర్మన్ సల్ల తిరుపతయ్య, ఇతర ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రజలు మరియు గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.