Take a fresh look at your lifestyle.

కాకతీయ హైస్కూల్ లో అభినందన సభ

మంథని, ముద్ర : మంథని మున్సిపల్ లోని కాకతీయ హై స్కూల్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఆసియాలోని అతిపెద్ద ఒలంపియాడ్ ఎస్ఓఎఫ్ వారు నిర్వహించిన ఇంటర్నేషనల్ మ్యాథ్స్ ఒలంపియాడ్,నేషనల్ సైన్సు ఒలంపియాడ్ లో మెడల్ ఆఫ్ డిస్టింక్షన్ మరియు గోల్డ్ మెడల్ ఆఫ్ ఎక్సలెన్స్ సాధించిన విద్యార్థులకు పాఠశాల ఆవరణలో సోమవారం అభినందన సభ నిర్వహించారు.ఈ పోటీ పరీక్షలో మొత్తము 457 మంది పరీక్షకు హాజరు కాగా, 306 మంది విద్యార్థిని విద్యార్థులు లెవెల్ టూ కు ఎంపికయ్యారు. లెవెల్ వన్ లో ఎన్ఎస్ఓ నుండి గోల్డ్ మెడల్ ఆఫ్ ఎక్స్లెన్స్ కి 103 మంది, మెడల్ ఆఫ్ డిస్టెన్స్ కు 51 మంది ఎంపికైనారు.ఐఏంఓ నుండి గోల్డ్ మెడల్ ఆఫ్ ఎక్స్లెన్స్ కు 164 మంది ఎంపికయ్యారు. ఎంపికైన విద్యార్థినీ విద్యార్థులకు సర్టిఫికెట్స్ మరియు గోల్డ్ మెడల్స్ తో సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంథని మండల సిఆర్పి మల్లయ్య, మండల ట్రస్మా అధ్యక్షులు అశోకన్ , స్టేట్ రిసోర్స్ పర్సన్ గిట్ల భరత్ రెడ్డి హాజరై విద్యార్థులను అభినందించారు.ఇటీవల డీఎస్సీలో ఫిజికల్ సైన్స్ లో మంథని మండల టాపర్ గా నిలిచిన శీలం దేవేందర్ రెడ్డిని పాఠశాల ప్రిన్సిపల్ ప్రదీప్ రెడ్డి శాలువాతో సన్మానించారు. సిఆర్పి మల్లయ్య మాట్లాడుతూ కాకతీయ పాఠశాలలో,పాఠశాల స్థాయి నుండి ఐఐటి వంటి పోటీ పరీక్షలకు ముందస్తుగానే విద్యార్థినీ,విద్యార్థులను సిద్ధం చేయడం అభినందనీయమని ప్రశంసించారు. మారుమూల ప్రాంత విద్యార్థినీ విద్యార్థులకు కూడా ఇలాంటి పోటీ పరీక్షల గురించి అవగాహన కల్పించి ముందస్తుగా సంసిద్ధులను చేయడం పాఠశాలకే గర్వకారణమని భరత్ రెడ్డి సార్ అన్నారు. పాఠశాల ప్రిన్సిపల్ ప్రదీప్ రెడ్డి సార్ మాట్లాడుతూ అతి తక్కువ ఫీజులతో కార్పొరేట్ స్థాయిలో విద్యానందిస్తూ ఉత్తమ ఫలితాలను సాధిస్తున్న విద్యార్థులను ప్రోత్సహిస్తూ ముందుకు వెళ్తున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో టీఎస్టీయూ మండల ప్రెసిడెంట్ కిషోర్,పాఠశాల డైరెక్టర్స్ రవికిరణ్ రెడ్డి, శ్రావణ్ రెడ్డి, స్రవంతి,పావనీ లు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.