- రాష్ట్రంలో రూ.6680 కోట్ల కేటాయింపు.
- 4 కోట్ల మహిళలకు లబ్ది.
- సంక్షేమ పథకాల్లో రేవంత్ ప్రభుత్వం ముందంజ.
- రాష్ట్ర వ్యవసాయ సలహాదారు పోచారం.
బాన్సువాడ, ముద్ర: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళల సంక్షేమమే ధ్యేయంగా అనేక సంక్షేమ పథకాలను ప్రారంభిస్తున్నారని, అందులో భాగంగానే మహిళలకు ఉదో బస్సు సౌకర్యాన్ని మహాలక్ష్మి పథకం ద్వారా కల్పించారని, దీని కోసం ఇప్పటి వరకు రూ.6.680 కోట్లు కేటాయించారని రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనవాస్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఆర్టీసి బస్టాండ్లో జరిగిన మహాలక్ష్మి సంబరాలో ఆయన పాల్గొని మాట్లాడారు. కేవలం ఆధాā ఉంటే ఉచితంగా బస్సు సౌకర్యం కల్పిస్తున్నారని, దీని వల్ల మహిళలకు ఎంతో సౌలభ్యం ఏర్పడిందని, ఆర్టీసికి ఆదాయం కూడా పెరిగిందని అన్నారు. ఒక్క బాన్సువాడా పరిధిలోనే సుమారు 1.63 కోట్ల మహిళలు ఉచిత బస్సులో ప్రయాణించారని, దీని కోసం రూ.62కోట్లను ప్రభుత్వం చెల్లించిందని అన్నారు. బస్సుల్లో మహిళలు ప్రయాణించడం వల్ల రోడ్డు ప్రమాదాలు తగ్గాయని, ప్రయాణికుల సంఖ్య పెరిగినా డ్రైవర్లు, కండక్టర్లు ఎంతో ఓర్పుతో బస్సులను నడుపుతున్నారని అన్నారు. ఈ పధక కర్ణాటక తర్వాత తెలంగాణలోనే అమలవుతోందన్నారు. దీనితో పాటు ఉచిత విద్యుత్తు, రూ.500లకే గ్యాస్ సిలిండర్, సన్నబియ్యం పంపిణీ పథకాలు పేదలకు ఎంతో ఉపయోగపడుతున్నాయన్నారు.ముఖ్యమంత్రి దేశంలోనే మొదటిసారి బిసిల కోసం పోరాడుతున్నారని, కులగణన దేశంలోనే ప్రథమమని అన్నారు.సంక్షేమ రంగా ప్రభుత్వం ముందు వరుసలో ఉందన్నారు.
- ఇది ప్రజా ప్రభుత్వం : కాసుల
ముఖ్యమంత్రి రేవంత్ నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం విజయవంతంగా నడుస్తోందని రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు పేర్కొన్నారు. మహాలక్ష్మి పథక మహిళలు, విద్యార్థినులు ఎంతో సౌకర్యవంతంగా తమ గమ్యస్థానాలకు చేరుతున్నారని, అలాగే ప్రతీ ఒక్కరికి ఆర్థికంగా చేయూత అందుతోందని అన్నారు. పంపినీ కూడా చారిత్రాత్మకమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉత్తమ డ్రైవర్లు, కండక్టర్లు, రెగ్యులర్గా ఆర్టీసిలో ప్రయాణించే మహిళలు, విద్యార్థినులను ఎం సన్మానించారు. అలాగో వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ కిరణ్మయి. డిపోమేనేజర్ సరిత, జంగం గంగాధర్, అలీబిన్ అబ్దుల్లా, సాయిలు, అజీం, నార్ల రవీందర్, గోపాల్రెడ్డి, ఆర్టీసి ఉద్యోగి బసంత్ తదితరులు పాల్గొన్నారు.
