Take a fresh look at your lifestyle.

టిబి నిర్మూలన కోసం గ్రామాలలో ప్రత్యేక వైద్య శిబిరాలు

ముద్ర.వీపనగండ్ల :  రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి టీబీ( క్షయ) వ్యాధి నిర్మూలన కోసం గ్రామాలలో ప్రతిష్టాత్మకంగా వ్యాధి నిర్ధారణ పరీక్షలు కార్యక్రమాన్ని చేపట్టినట్లు జిల్లా టీబీ నోడల్ ఆఫీసర్ డాక్టర్ వంశీకృష్ణ, మండల వైద్యాధికారి డాక్టర్ రాజశేఖర్ తెలిపారు.ఇట్టి కార్యక్రమం జిల్లాలో వంద రోజులపాటు నిర్వహించడం జరుగుతుందని అందులో భాగంగా గురువారం మండల పరిధిలోని కల్వరాల పుల్గర్చర్ల గ్రామాలలో టీబీ వ్యాధి నిర్ధారణ పరీక్షల వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని,టీబీ వ్యాధి లక్షణాలున్న రోగులను గుర్తించి వారికి అక్కడే వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వివరించారు.క్షయ వ్యాధిని నిర్ధారించడానికి చర్మపరీక్ష,రక్త పరీక్ష, చాతి ఎక్స్-రే, మూత్ర పరీక్షలు నిర్వహించి క్షయ వ్యాధిని నిర్ధారించడం జరుగుతుందని తెలిపారు. క్షయ వ్యాధి ఒక లక్షణాలు రోగి బలహీనత లేదా అలసటగా ఉండటం,రోజురోజుకు బరువు తగ్గటం, ఆకలి లేకపోవడం, జ్వరం రాత్రిపూట చెమటలు పట్టడం, గొంతు బొంగురు పోవడం, వంటి లక్షణాలు ఉంటాయని, ఇలాంటి లక్షణాలున్న ప్రతి ఒక్కరు వెంటనే వైద్యులను సంప్రదించి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. టీబీ వ్యాధి ఉన్నవారు బహిరంగ ప్రదేశాల్లో తుమ్మటం,తగ్గటం, ఉమ్ము వేయటం చేయరాదని సూచించారు. క్షయ వ్యాధిగ్రస్తులు క్రమం తప్పకుండా పౌష్టికాహారాన్ని భుజించాలని,వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ ఆరోగ్యకమైన వాతావరణం ఉండాలని, క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకుంటూ వైద్యుల సలహాలు సూచనలతో మందులు వాడితే టీవీ వ్యాధిని నివారించవచ్చని తెలిపారు.కార్యక్రమంలో ఆయుష్ డాక్టర్స్ శ్వేత,కరుణశ్రీ,హెల్త్ ఎజుకేటర్ కేశవులు, హెల్త్ అసిస్టెంట్స్ రాములు,జహంగీర్, ఏఎన్ఎంలు సునీత,శోభా,సునందన, టీబీ ప్రోగ్రామ్ సిబ్బంది ప్రవీణ్,రత్నం,ధర్మ, గోవిందు,మరియు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.