ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి :
ఈనెల 10న సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్లో జరగబోయే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరుతూ బిజెపి పట్టణ శాఖ అధ్యక్షులు రత్నాపురం బలరాం ఆధ్వర్యంలో శుక్రవారం భువనగిరి సావర్కర్ చౌరస్తా నుండి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్ జైనపల్లి శ్యామ్ సుందర్ రెడ్డి, పాశం భాస్కర్, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాయా దశరథ, సుర్వి శ్రీనివాస్, కౌన్సిలర్ బండారి స్వర్ణలత, పట్టణ ప్రధాన కార్యదర్శిలు ఉడుత భాస్కర్, బొర్ర రాకేష్, యువర్ మోర్చా జిల్లా అధ్యక్షులు పట్నం కపిల్, ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రత్నపురం శ్రీశైలం, పట్టణ ఉపాధ్యక్షులు కొల్లోజు సతీష్, ఎదగని సంతోష్, యాట వెంకటేష్, కారుపాటి రాజు, యువమోర్చా అధ్యక్షులు కానుకుంట్ల రమేష్ , ఎంజాల రాంప్రసాద్, ఎంజలా మల్లిక, తడూరి రాజు,పవన్,భరత్ పాల్గొన్నారు.