ముద్ర ప్రతినిధి, నిర్మల్:
రెండు రోజుల క్రితం డాక్టర్ పై దాడి కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనలో నలుగురిని అరెస్ట్ చేసినట్లు ఎస్పీ జానకి షర్మిల వెల్లడించారు. విధుల్లో ఉన్న డాక్టర్, సిబ్బందిపై భౌతిక దాడికి పాల్పడిన నిందితులను సి సి టీవీ ఫుటేజ్ ఆధారంగా మహమ్మద్ సల్మాన్ హుస్సేన్ @ షేక్ సల్మాన్, మహమ్మద్ షౌకత్, షాబాద్ అలీ, మహమ్మద్ ఆజాద్ హుస్సేన్ లుగా గుర్తించామన్నారు. వీరిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించామని తెలిపారు. ఈ కేసులో తీవ్రంగా శ్రమించి నిందితులను పట్టుకున్న నిర్మల్ ఏఎస్పీ సాయి కిరణ్,భైంసా రూరల్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్, నిర్మల్ రూరల్ ఇన్స్పెక్టర్ కృష్ణ, నిర్మల్ ఇన్స్పెక్టర్ సమ్మయ్య, నిర్మల్ రూరల్ ఎస్ఐ లింబాద్రి, నర్సాపూర్ ఎస్ఐ గణేష్, సోన్ ఎస్ఐ గోపి లను ఎస్పీ డా.జి.జానకి షర్మిల అభినందించారు.