- మేం అడిగి వాటికి సమాధానం ఇవ్వండి.
- హార్డ్ డిస్క్‌లు ఎందుకు ధ్వంసం చేశారు.
- ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇంటలీజెన్సీ మాజీ ఐజీ ప్రభాకర్‌రావు విచారణ.
- రెండో రోజు విచారణ చేసిన సిట్.
- ఈసారి టెలికాం సర్వీస్ డేటా, ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్.
- ఐదుగురు నిందితుల స్టేట్మెంట్ ముందుంచి ప్రశ్నల వర్షం.
- తనపై ఉన్నతాధికారుల సర్వెలైన్ ఉందంటూ తప్పించుకునే ఆన్సర్స్ ఇచ్చిన ప్రభాకర్‌రావు.
ముద్ర, తెలంగాణ బ్యూరో : ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ టి.ప్రభాకర్ రావు ను సిట్ బృందం బుధవారం రెండవ సారి విచారణ చేసింది. సోమవారం విచారణ సంబర్భంగా తదుపరి విచారణకు ప్రభాకర్ రావు అప్పుడు ఉపయోగించిన సెల్ ఫోన్లు, ల్యాప్ టాప్ తీసుకరావాలని ఆదేశించారు. ఈ మేరకు రెండోసారి విచారణకు హాజరైన ప్రభాకర్ రావు నుంచి వ్యక్తిగత సెల్ ఫోన్లను దర్యాప్తు బృందం స్వాధీనం చేసుకుంది. అయితే, తొలిసారి విచారణ సందర్భంగా సిట్ అధికారులను ప్రభాకర్‌రావు ఎదురు ప్రశ్నించారు.మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయంటూ ఎదురుతిరిగారు. దీంతో ఇప్పుడు తమ ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలంటూ సిట్ పోలీసులు సీరియస్‌గా ప్రశ్నించారు. ఉగ్రవాదులు, తీవ్రవాదులకు సంబంధించిన కీలక సమాచారం ఉన్న అధికారిక హార్డ్ డిస్క్ లను మాజీ డీఎస్సీ ప్రణీత్ రావు ధ్వంసం చేయడంపైన, డీసీపీ రాధ కిషన్ రావు, ఏసీపీలు భుజంగరావు, తిరుపతన్న ఇచ్చిన స్టేట్మెంట్ల సమాచారం ముందు పెట్టి ప్రభాకర్ రావును సిట్ విచారించింది. వారంతా ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే ట్యాపింగ్ జరిగినట్లుగా గతంలో వెల్లడించారు. ఈ నెల 9న దాదాపు 8 గంటల పాటు ప్రభాకర్ రావును సిట్ ప్రశ్నించింది.
- సమాధానం చెప్పండి.
ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకరరావును సెట్ అధికారులు రెండో రోజు బుధవారం దాదాపు 8 గంటలకుపైగా విచారించారు. హార్డ్ డిస్క్‌లు ధ్వంసంపై ముందుగా ప్రశ్నలు వేశారు. ఈ సందర్భంగా ప్రభాకర్‌రావు సరైన సమాధానాలు ఇవ్వకపోవడం, మౌనంగా ఉండటంతో.. గతంలో ప్రణీత్ రావు, రాధ కిషన్ రావు, తిరుపతన్న ఇచ్చిన స్టేట్‌మెంట్లు ముందు పెట్టి అధికారులు విచారణ చేశారు. ఈ సందర్భంగా ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించి టెలికాం సర్వీస్ డేటాను సైతం సిట్ మాజీ ఐజీ ముందు ఉంచింది. అయితే, తనపై ఉన్నతాధికారుల సర్వెలైన్ ఉందంటూ ప్రభాకర్‌రావు నోరు మొదపడం లేదని సిట్ బృందం చెబుతుంది. కాగా, 2023 అసెంబ్లీ ఎన్నికలు, అంతకు ముందు జరిగిన ఉప ఎన్నికల సమయంలో ఆయన వాడిన అధికారిక, అనధికారిక సెల్‌ఫోన్లను తమకు అప్పగించాలని సిట్ అధికారులు ఆదేశించారు.సెల్‌ఫోన్లతో పాటు ల్యాప్‌టాప్, మ్యాక్ నోట్‌బుక్‌లను సైతం అందజేయాలని సూచించారు. ఒకవేళ అడిగిన వివరాలు ఇవ్వకుంటే తామే స్వయంగా సోదాలు చేస్తామని సిట్ అధికారులు హెచ్చరించడంతో.. సెల్ఫోన్లు, ల్యాప్‌ట్యాప్, మ్యాక్ బుక్‌లను ప్రభాకర్‌రావు ఇచ్చారు. తొలిరోజు విచారణలో ప్రభాకర్‌రావు విచారణాధికారులకు సరిగ్గా సహకరించక, ఎదురు ప్రశ్నలు వేసిన నేపథ్యంలో తదుపరి విచారణలో ఇప్పటి వరకు అరెస్టు అయిన రాధాకిషన్‌రావు, తిరుపతన్న, భుజంగరావు, ప్రణీత్‌రావు వాంగ్మూలాలు, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబరేటరీ (ఎఫ్ఎస్ఎల్) నుంచి రిట్రీవ్ చేసిన డాటా ఆధారంగా విచారణ చేశారు.
- జడ్జీల ఫోన్ ట్యాప్ చేయమని ఎవరు చెప్పారు.
ముఖ్యంగా.. కొందరూ న్యాయమూర్తులతో పాటు కొన్ని కీలక ప్రొఫైల్స్‌ను ఎందుకు తయారు చేయాల్సి వచ్చింది.స్పెషల్ ఆపరేషన్ టీంను ఎందుకు ఏర్పాటు చేశారు.. హోంశాఖ ముఖ్య కార్యదర్శి రవిగుప్తాకు తెలియకుండా ఫోన్ ట్యాపింగ్ ఎలా చేశారు.. అనే విషయాలపై ఆధారాలను ఆయన ముందు పెట్టి, సిట్ ప్రశ్నించింది. జడ్జిల ఫోన్లను ఎందుకు ట్రాప్ చేశారని, అసలు ఎవరు ట్రాప్ చేయన్నారంటూ సిట్ ప్రశ్నించింది.కానీ, వీటికి ప్రభాకర్‌రావు నుంచి సమాధానం రాలేదు.అంతే కాకుండా ప్రైవేట్ వ్యక్తిగా శ్రవణ్‌రావుకు ఏం సంబందం ఉందని, ఆయనకు ఫోన్ ట్యాపింగ్ వివరాలు ఎందుకు ఇచ్చారని సిట్ ప్రశ్నించింది.కాగా.. ప్రభాకర్‌రావు మంగళవారం నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. ప్రభాకర్‌రావు అమెరికాలో ఉన్న సమయంలో ఆయనను ప్రకటిత నేరస్థుడిగా ప్రకటించాలంటూ సిట్ అధికారులు నాంపల్లి కోర్టును ఆశ్రయించారు.ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన నాంపల్లి కోర్టు న్యాయమూర్తి ఈ నెల 20వ తేదీలోపు ప్రభాకర్‌రావు కోర్టులో హజరుకావాలని ఆదేశించారు. అయితే.. సంబంధింత న్యాయమూర్తి సెలవులో ఉండటంతో ప్రభాకర్‌రావు వెనుదిరిగారు.