Take a fresh look at your lifestyle.

కైతలాపూర్‌ డంపింగ్‌ యార్డులో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

ముద్ర కూకట్‌పల్లి:
కైతలాపూర్ డంపింగ్ యార్డ్‌లోని చెత్తకుప్పలో బుధవారం సాయంత్రం ఒక గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతుడి వయసు 45 నుండి 50 ఏళ్ల మధ్య ఉండవచ్చని, మృతదేహం పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో ఉందని పోలీసులు తెలిపారు.నరసింహ అనే వ్యక్తి డయల్ 100 ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశారు.కూకట్‌పల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.
మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.
పోలీసులు కేసు నమోదు చేసి, మృతుడు ఎవరనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు.

Leave A Reply

Your email address will not be published.