- పర్యావరణ పరిరక్షణపై తెలంగాణ – జపాన్ మధ్య కీలక ఒప్పందం.
ముద్ర, తెలంగాణ బ్యూరో : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాల్లో ప్రత్యేక అతిథులుగా జపాల్ ప్రతినిధి బృందం హాజరుకానున్నారు. జపాన్‌లోని కితాక్యూషూ నగర మేయర్ కజుహిసా టకేచీ నేతృత్వంలోని జపాన్ ప్రతినిధి బృందం ఈ వేడుకల్లో పాల్గొంటుంది.అలాగే ఐటీసీ కాకతీయ హోటల్‌లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున కితాక్యూషూ సిటీలో పరస్పర సహకార ఒప్పందంపై సంతాకాలు చేయనుంది.ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి జపాన్ పర్యటనలో భాగంగా కితాక్యూషూ నగరాన్ని సందర్శించారు.అప్పట్లో ఆహ్వానం అందుకున్న మేయర్ ఈ వేడుకల కోసం ప్రత్యేకంగా హాజరవుతున్నారు.గతంలో అధిక కాలుష్యంతో బాధపడిన కితాక్యూషూ నగరం ఇప్పుడు పర్యావరణ పరిరక్షణలో ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది.ఈ నేపథ్యంలో, హైదరాబాద్ నగరానికి సైతం పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణలో ఈ ఒప్పందం ద్వారా సహకారం లభించే అవకాశముంది.