Take a fresh look at your lifestyle.

ఆశా కార్యకర్తల సమస్యలను  పరిష్కరించాలని కోరుతూ నిరసన

 

ముద్ర, తుంగతుర్తి….

ఆశా కార్యకర్తలకు ఉద్యోగ భద్రత కల్పించాలని, ఉచిత వైద్యం, నెలకు 18 వేల జీతం ప్రభుత్వం ప్రకటించాలని కోరుతూ మంగళవారం తుంగతుర్తి మండల కేంద్రంలో ఆశా వర్కర్లు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా నాయకురాలు జయమ్మ మాట్లాడుతూ గడిచిన రెండు సంవత్సరాలుగా ఆశా కార్యకర్తలు జీతాలు పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ, నిరసన కార్యక్రమాలు చేపట్టినప్పటికీ నేటి వరకు కూడా ప్రభుత్వం సమస్యను పరిష్కరించకపోవడం దారుణమని అన్నారు. చాలీచాలని వేతనాలతో, కరోనా కష్ట కాలంలో ప్రాణాలను తెగించి ఎంతోమంది రోగులను కాపాడి, జీవితం గడుపుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెద్ద మనసుతో స్పందించి ఆశా కార్యకర్తల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా మండల స్థాయి ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.