Take a fresh look at your lifestyle.

మెదక్ కలెక్టర్ ప్రతిమా సింగ్ బాధ్యతలు

ముద్ర ప్రతినిధి, మెదక్:
మెదక్ నూతన కలెక్టర్ గా ప్రతిమాసింగ్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. అదనపు కలెక్టర్ నగేష్, జిల్లా అధికారులు
స్వాగతం పలికారు. ప్రతిమా సింగ్ రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ గా పనిచేస్తుండగా కలెక్టర్ గా బదిలీపై వచ్చారు. గతంలో మెదక్ అదనపు కలెక్టర్ గా పనిచేసి వెళ్లారు.


బాధ్యతలు చేపట్టిన అనంతరం కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ…ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు చేరాలని అన్నారు. ప్రభుత్వం అప్పగించిన బాధ్యతను నెరవేర్చుతూ, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలా కృషి చేస్తానన్నారు.
ఇంటర్, పదో తరగతి పరీక్షల గురించి డీఈఓను, ఇంటర్మీడియట్ అధికారిని అడిగి తెలుసుకున్నారు. ప్రశాంతంగా పరీక్షలు నిర్వహించాలన్నారు.
జెడ్పి సీఈఓ ఎల్లయ్య, డిఆర్ఓ భుజంగరావు, డీఆర్డీఓ శ్రీనివాస్ రావు, ఇతర జిల్లా అధికారులున్నారు.

Leave A Reply

Your email address will not be published.