ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్:
నాగర్‌కర్నూల్ పట్టణంలో పవిత్ర రంజాన్ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని ముస్లిం మైనార్టీ సోదరులు స్థానిక ఈద్గా వద్ద ఘనంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి కార్యక్రమానికి హాజరై ముస్లిం సోదరులందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ పండుగ సామరస్యానికి, సోదరభావానికి ప్రతీక అని పేర్కొంటూ, ఈ పవిత్ర పర్వదినం ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆనందం, శాంతి, సౌభ్రాతృత్వం నింపాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రమణరావు, మున్సిపల్ చైర్మన్ తీగల సునేంద్ర, వైస్ చైర్మన్ బాదం రమేష్, కౌన్సిలర్లు, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.