Take a fresh look at your lifestyle.

సంక్షేమ రంగాలకు నిధుల కోతపై నిరసన

ముద్ర ప్రతినిధి, మెదక్:
రాష్ట్ర బడ్జెట్లో సంక్షేమ రంగాలకు నిధుల కోతకు నిరసనగా మెదక్ పట్టణంలో ప్రజాసంఘాల ఆధ్వర్యంలో శనివారం నిరసన తెలిపారు. ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ…తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్లో వికలాంగుల సంక్షేమనికి నిధుల కేటాయింపులో తీవ్రమైన నిర్లక్ష్యం ప్రదర్శించిందన్నారు. 2016 వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టం ప్రకారం 5 శాతం నిధులు కేటాయించాలి. కానీ బడ్జెట్ కేటాయింపుల్లో వికలాంగుల సంక్షేమ శాఖను పూర్తిగా విస్మరించారు. ఈసారి బడ్జెట్లో నిధుల కేటాయింపులో ఎలాంటి పురోగతి లేదు. మహిళా,శిశు, వికలాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖకు 3143 కోట్లు కేటాయించిందని, ఇందులో వికలాంగుల సంక్షేమనికి ఎంత కేటాయించారో ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కే. మల్లేశం, వికలాంగుల హక్కుల జాతీయ వేదిక రాష్ట్ర కమిటీ సభ్యురాలు కే. కవిత, జిల్లా ఉపాధ్యక్షులు యాదగిరి, సహాయ కార్యదర్శి వెంకట్, సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి జె. సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.