టిటియు రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరు మురళి
పాఠశాల విద్యావ్యవస్థను బాగుచేయడానికి ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉంది ఎం.ఎల్.సి అద్దంకి దయాకర్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 15% బడ్జెట్ నిధులు ఐదు సంవత్సరాల పాటు వరుసగా కేటాయిస్తేనే పాఠశాల విద్యారంగం బాగుపడుతుందని తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరు మురళి తెలంగాణ టీచర్స్ యూనియన్ రాష్ట్ర కార్యవర్గాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఈరోజు తెలంగాణ టీచర్స్ యూనియన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నాంపల్లి లో గల తెలంగాణ ఫోర్త్ క్లాస్ ఎంప్లాయిస్ భవన్లో తెలంగాణ టీచర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మునగాల మణిపాల్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథిగా తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి హాజరై రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వరుసగా ఐదు సంవత్సరాల పాటు బడ్జెట్లో 15% నిధులను కేటాయిస్తే పాఠశాల విద్యా రంగం బాగుపడుతుందని తెలిపినారు. తెలంగాణ విద్యారంగం గత పది సంవత్సరాలపాటు పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని ఇప్పటికైనా దీనిని బాగు చేసుకోవడం కోసం ఒక ఉద్యమం రావడం అవసరమని, దానికి గాను తెలంగాణ టీచర్స్ యూనియన్ తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించినట్లుగానే తెలంగాణలోని విద్యారంగం బాగుపడడానికి వచ్చే ఉద్యమానికి నాయకత్వం వహించాలని ఆయన అభిప్రాయపడ్డారు.
మన దేశం మాత్రం విద్యలో దారుణాతి దారుణంగా 133 ర్యాంకులో ఉండడం దురదృష్టకరమని, ఈ విధంగా ఉండడానికి కారణం మన దేశంలోని కొంతమంది పాలకులు అందరికీ విద్య ఇవ్వకూడదని వారిని కేవలం ఓటర్లుగా మాత్రమే ఉంచాలని భావించడం వల్లనే ఈ దుస్థితి నెలకొందని, విద్యా వ్యవస్థ బాగుపడాలంటే కూడా రాజకీయ సంకల్పం అత్యంత ప్రధానమని కాబట్టి ఆకునూరి మురళి గారు తెలిపినారు. మన దేశం అనుసరిస్తున్న విద్యా విధానం వల్ల ఒక్క నోబుల్ బహుమతిని పొందే శక్తివంతమైన సైంటిస్టులను తయారు చేసుకోలేకపోయామని సైన్స్ కు అధిక ప్రాధాన్యం ఇచ్చి నోబెల్ స్థాయిలో పరిశోధనలు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని పాలకులకు ఆయన సూచించారు.సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన శాసనమండలి సభ్యులు మరియు కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్ అద్దంకి దయాకర్ గారు రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉపాధ్యాయులకు దాదాపు 30 వేల మందికి ప్రమోషన్లు, డీఎస్సీ ద్వారా 11 వేల ఉద్యోగాలు, పాఠశాల విద్యా రంగంలో పెండిరగ్లో ఉన్న పండిట్ల సమస్యను పరిష్కరించి ప్రమోషన్లు కల్పించామని అదేవిధంగా ఎన్నో సంవత్సరాలుగా పెండిరగ్లో ఉన్న మండల విద్యాధికారి పోస్టులను నింపామని, అన్ని పాఠశాలలకు ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పించామని, మౌలిక వసతుల కల్పనకు నిధులను కేటాయించామని, ఇంటర్నెట్ సౌకర్యం కూడా కల్పించామని తెలుపుతూ, మొత్తం పాఠశాల విద్యారంగంపై ముఖ్యమంత్రి గారు ప్రత్యేక దృష్టి సారించారని రాబోయే కాలంలో పాఠశాల విద్యారంగాన్ని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దడం కోసం ప్రపంచ స్థాయి పౌరులను తయారు చేయడం కోసం ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ వ్యవస్థను తీసుకురాబోతున్నామని దీని ద్వారా ఇప్పటికే పని చేస్తున్న పాఠశాల విద్యా వ్యవస్థకు నష్టం జరగకుండా చూస్తామని వారు తెలియజేసినారు. రాబోయే రోజుల్లో ప్రీ ప్రైమరీ విద్యను ప్రాథమిక పాఠశాలలోనే ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా వారు తెలిపినారు. మరోసారి బదిలీలు ప్రమోషన్లు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అదేవిధంగా తద్వారా ఏర్పడే ఖాళీలను భర్తీ చేసేందుకు మరో డిఎస్సి ని కూడా నిర్వహించేందుకు ప్రభుత్వం సంకల్పిస్తుందని అద్దంకి దయాకర్ గారు తెలియజేయడం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోలంపల్లి ఆదర్శన్‌రెడ్డి గారు, సంఘం ముఖ్య సలహాదారు డాక్టర్ ఏరుకొండ నరసింహస్వామి గారు, అసోసియేట్ అధ్యక్షులు రమేష్ గారు మోహన్ గారు మరియు తెలంగాణ 33 జిల్లాలకు చెందిన అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.మునగాల మణిపాల్‌రెడ్డి, పోలంపెల్లి ఆదర్శన్‌రెడ్డి, రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.