Take a fresh look at your lifestyle.

మహబూబ్ నగర్ కలెక్టర్ గా ఖుష్బూ గుప్తా

 
ముద్ర, ఉమ్మడి
మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి :
………………………………………
మహబూబ్ నగర్ జిల్లా నూతన కలెక్టర్ గా ఖుష్బూ గుప్తా నియమితులయ్యారు. ఇక్కడ పనిచేస్తున్న కలెక్టర్ విజయెంద్ర బోయి సోషల్ వెల్ఫేర్ శాఖ కార్యదర్శిగా నియమించబడ్డారు.
అలాగే నారాయణ పేట కలెక్టర్ సిక్తా పాట్నాయక్ ను ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శిగా బదిలీ చేశారు.ఈమె స్థానం లో ప్రదీప్ జైన్ కొత్త కలెక్టర్ గా నియమించారు.అదేవిధంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పలువురు కీలక అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. మహబూబ్ నగర్ అదనపు కలెక్టర్ గా (రెవెన్యూ) హరిప్రియను నియమించారు. ప్రస్తుతం ఆమె మేడ్చల్ డీఆర్ఓ గా పనిచేస్తున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా డీ ఆర్ ఓగా పద్మజారాణి,ఇక్కడ జిల్లా హొసింగ్ పీడీ గా ఉన్న శ్రీనివాసరావు ను ఇక్కడే ఆర్డీవోగా నియమితులయ్యారు. ఇదే జిల్లా ఆర్ డీ ఓ గా పనిచేస్తున్న అలివేలు ను హోసింగ్ పీడీ గా నియమింపబడ్డారు.సాధారణ బదిలీల్లో భాగంగా ఈ బదిలీలు జరిగాయని అధికారులు వెల్లడించారు.

Leave A Reply

Your email address will not be published.