Take a fresh look at your lifestyle.

పల్టీ కొట్టిన హైదరాబాద్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ పాఠశాల బస్సు

పల్టీ కొట్టిన హైదరాబాద్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ పాఠశాల బస్సు

గాయపడ్డ విద్యార్థులు

ముద్ర, బండ్లగూడ: వేగంగా వచ్చిన పాఠశాల బస్సు డివైడర్ను ఢీ కొట్టి రోడ్డుకు అటు వైపు ఎగిరి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో చిన్నారులు గాయాలతో బయటపడ్డారు. వివరాల్లోకి వెలితే….. బండ్లగూడ జాకీర్ లో క్రాంతి చంద్ర అక్కడ హైదరాబాద్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ పేరుతో పాఠశాల నిర్వహిస్తున్నాడు. త్వరలో పాఠశాలకు సంబంధించిన సాంస్కృతిక కార్యక్రమాలతో ఫంక్షన్ నిర్వహించనున్నారు. దీనికోసం అజీజ్ నగర్ లోని చాందిని గార్డెన్లో ప్రాక్టీస్ చేసుకోవడానికి విద్యార్థులు పాఠశాల బస్సుల్లో వెళ్లారు. తిరిగి వస్తుండగా మృగవని రిసార్ట్స్ ముందు బస్సు డివైడర్ను ఢీ కొట్టి ఎగిరి రోడ్డుకు అటువైపు బోల్తా కొట్టి పడింది. బస్సులో ఇరుక్కున్న విద్యార్థులు ఆహాకారాలు చేస్తుండగా వాహనదారులు బస్సు అద్దాలు పగలగొట్టి చిన్నారులను బయటకు తీశారు. వెంటనే వాహనాలలో ఖాళీ మందిర్ వద్ద ఉన్న షాదన్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. కమిషనర్ తో పాటు, పోలీస్ అధికారులు నాయకులు ఆసుపత్రిలో గాయపడ్డ చిన్నారులను పరామర్శించారు.

Leave A Reply

Your email address will not be published.