ముద్ర ప్రతినిధి, ఉమ్మడి ఖమ్మం : ఖమ్మం నగర వన్ టౌన్ సీఐగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన టి.కరుణాకర్ ను మాల మహనాడు నాయకులు బుధవారం మర్యాద పూర్వకంగా కలిశారు.ఈసందర్భంగా వారు సీఐని శాలువతో సత్కరించి అభినందనలు తెలిపారు.సీఐని కలిసిన వారిలో మాల మహనాడు జిల్లా అధ్యక్షులు దాసరి శ్రీనివాస్, నాయకులు కరాటే వేణు, కళాంగి డేవిడ్, గుండు మాల అంజి, రెంటాల నాగేశ్వరరావు తదితరులు వున్నారు.