Take a fresh look at your lifestyle.

నాసిరకం సరుకులు వినియోగంపై ప్రజావాణిలో ఫిర్యాదు

మల్యాల, ముద్ర : ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో నాసిరకం సరుకులు వినియోగంపై సోమవారం కొండగట్టు మాజీ ధర్మకర్త పోచమ్మ ప్రవీణ్ ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. భక్తులకు అందించే అన్న ప్రసాదం, బియ్యం, లడ్డు లలో నాసిరకం సరుకులు పులిహార కోసం వినియోగించే బియ్యం స్ట్రిమ్ చేసి వాడుతున్నారు.కాంట్రాక్టర్ నాసిరకం సరుకులు పంపిణీ చేస్తున్నప్పటికీ ఉన్నతాధికారులు అభ్యంతరం తెలపకుండా వినియోగిస్తున్నారు.భక్తితో ఆస్వాదించే ప్రసాదం నాసిరకం సరుకులతో తయారు కావడం భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వచ్చే హనుమాన్ జయంతికి లక్షలాది భక్తులు తరలివచ్చే అవకాశం ఉండడంతో నాసిరకంతో తయారు కావడం ఆలయ ప్రతిష్ట దిగజారి అవకాశం ఉంటుందని ఫిర్యాదులు పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.