Take a fresh look at your lifestyle.

సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర ఎంతో కీలకమైనది : అదనపు కలెక్టర్ భాస్కర్ రావు

ముద్ర, ప్రతినిధి భువనగిరి :
సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర ఎంతో కీలకమైనదని అదనపు కలెక్టర్ భాస్కర్ రావు అన్నారు.
బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆయన జిల్లా గ్రంథాలయ చైర్మన్ అవేజ్ చిస్తి, మున్సిపల్ చైర్మన్ తంగేళ్లపల్లి శ్రీవాణి రవి కుమార్, వైస్ ఛైర్మన్ పోతంశెట్టి మంజులతో కలిసి ముందుగా జ్యోతి ప్రజ్వలన గావించి మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో ప్రతిభ చూపుతూ ముందుకు సాగుతున్నారన్నారు. మహిళల సాధికారత కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని పేర్కొన్నారు. జిల్లాలో మహిళల అభివృద్ధి, భద్రత, సాధికారత కోసం అధికారులు సమిష్టిగా పని చేస్తున్నారని అన్నారు.


ఈ కార్యక్రమంలో ,జిల్లా సంక్షేమ అధికారి నర్సింహ రావు, పౌర సరఫరాల అధికారి రోజా రాణి, ఇతర జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.