ముద్ర ప్రతినిధి, నిర్మల్:
నిర్మల్ పట్టణంలో డాక్టర్ సంతోష్ రాజ్ పై జరిగిన దాడి ఘటనకు నిరసనగా బీజేపీ ఇచ్చిన నిర్మల్ పట్టణ బంద్ పిలుపు విజయవంతమైంది. ముందుగానే బంద్ పిలుపు నేపథ్యంలో వ్యాపార, వాణిజ్య సంస్థలు తెరుచుకోలేదు. ప్రైవేటు విద్యాసంస్థలు సెలవు ప్రకటించాయి. పాత బస్టాండ్ ప్రాంతంలో ఒక వర్గం వారు దుకాణాలు తెరిచే ప్రయత్నం చేయటంతో ఆందోళనకారులు అడ్డుకున్నారు. దీంతో కొంత ఘర్షణ చోటు చేసుకుంది. ఐతే పోలీసులు సకాలంలో స్పందించి ఈ ఘర్షణను నివారించారు. హోటళ్లు మూతపడ్డాయి. ఆసుపత్రుల్లో ఓపీ సేవలు నిలిచిపోయాయి. అత్యవసర సర్వీసులైన మెడికల్ షాపులు, బస్సులను బంద్ నుంచి మినహాయించారు.