Take a fresh look at your lifestyle.

ప్రియదర్శిని డిగ్రీ కళాశాలలో దోస్త్ హెల్ప్ లైన్ సెంటర్ ప్రారంభం

 

ముద్ర, జోగుళాంబ గద్వాల‌ జిల్లా ప్రతినిధి:

గద్వాల్ లోని ప్రియదర్శిని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో దోస్త్ హెల్ప్ లైన్ సెంటర్‌ను గురువారం కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎ. మీనాక్షి,వైస్ ప్రిన్సిపాల్ లక్ష్మి ప్రసాద్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. డిగ్రీ కోర్సుల ప్రవేశాల కోసం తెలంగాణ ఉన్నత విద్యామండలి దోస్త్ నోటిఫికేషన్ విడుదల చేసిందని, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. దోస్త్ (DOST) ద్వారా ఉన్నత విద్యలో ప్రవేశాలు పొందదలచిన విద్యార్థులకు ఈ హెల్ప్ లైన్ సెంటర్ ద్వారా పూర్తిగా ఉచితంగా రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించబడుతుందని తెలిపారు.
దోస్త్ కోఆర్డినేటర్ పి. సురేష్ బాబు మాట్లాడుతూ, విద్యార్థులు తమ ఆధార్ కార్డు‌కు మొబైల్ నెంబర్ లింక్ చేసి ఉండాలని, అలాగే 10వ తరగతి మెమోలోని పేరు మరియు ఆధార్ కార్డులోని పేరు మధ్య ఎలాంటి తప్పులు లేకుండా చూసుకోవాలని సూచించారు.
దోస్త్ హెల్ప్ లైన్ సెంటర్‌కు సంబంధించిన వివరాల కోసం
దోస్త్ కో ఆర్డినేటర్ పి. సురేష్ బాబు ను 9052250692 నంబర్‌లో సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో అద్యాపకులు, అద్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.