- స్థానిక సంస్థల నిర్వహణ, రెండు గ్యారంటీల అమలుపై కీలక చర్చ.
- రైతుభరోసా ప్రకటించే అవకాశం.
ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర మంత్రివర్గం నేడు భేటీ కానుంది. మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర మంత్రులతో సమావేశం నిర్వహించనున్నారు. ఇందులో కీలక అంశాలు చర్చకు వచ్చే అవకాశాలున్నాయి. ప్రధానంగా రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చ జరగనుంది. ఈ విషయంపై ఇప్పటికే స్పష్టత ఇచ్చిన మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఎన్నికలపై నిర్వహణ, తేదీల ఖరారుపై కేబినెట్‌లో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.దీంతో నేడు జరగనున్న మంత్రివర్గ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌పై ప్రభుత్వం కీలక ప్రకటన చేసే అవకాశం కన్పిస్తున్నది. దీంతో పాటు రైతు భరోసా ఇచ్చే ఆలోచనలో ఉన్న ప్రభుత్వం దీనిపైనా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. అలాగే ఎన్నికల ముందు హమీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో మరో గ్యారెంటీని అమలుకు కీలక నిర్ణయాలు తీసుకుంటుందనే ప్రచారం అధికార పార్టీలో జరుగుతున్నది.