Take a fresh look at your lifestyle.

ఘనంగా శ్రీ రామ నవమి వేడుకలు

 

ముద్ర ప్రతినిధి, నిర్మల్:
నిర్మల్ జిల్లా వ్యాప్తంగా పవిత్ర శ్రీరామ నవమి వేడుకలు అత్యంత భక్తి శ్రద్ధల మధ్య నిర్వహించారు. ఉదయం నుంచే శ్రీ రామాలయాలకు భక్తులు దర్శనానికి తరలి వచ్చారు. పట్టణంలోని శాంతి నగర్, బాగుల వాడ, వాల్మీకి నగర్, రామ్ మందిరం వీధుల్లో శ్రీ రామ కళ్యాణం వేడుకలు నిర్వహించారు. ఆయా దేవాలయాల వద్ద శ్రీ రామ కళ్యాణం అనంతరం అన్నదానం ఏర్పాటు చేశారు. పర్వదినాన్ని పురస్కరించుకుని దేవరకోట నుండి భజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్ ల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు.

ఈ ర్యాలీని నిర్మల్ ఎంఎల్ఏ ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రారంభించారు. పురవీధుల గుండా ఈ ర్యాలీ సాగింది.ఈ శోభాయాత్రలో మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి, డాక్టర్ ప్రమోద్ చంద్రారెడ్డి, నూకల విజయ్ కుమార్ తదితరులున్నారు.

Leave A Reply

Your email address will not be published.