Take a fresh look at your lifestyle.

జోనల్ విన్నర్ గా లీడ్ శిక్ష అవార్డు పొందిన కోరుట్ల పబ్లిక్ స్కూల్

 

కోరుట్ల, ముద్ర;
లీడ్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన లీడ్ శిక్షా అవార్డు కార్యక్రమం హైదరాబాద్ నోవోటెల్ కన్వెన్షన్ హాల్ లో ఘనంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా దాదాపు 3000 వేల లీడ్ స్కూల్స్ లో కోరుట్ల పబ్లిక్ స్కూల్ “ఉత్తమ లీడ్ ఇంప్లిమెంటేషన్ స్కూల్” గా సౌత్ జోన్ విన్నర్ గా లీడ్ శిక్ష అవార్డు అందుకొడం గర్వంగా ఉందని కెపిఎస్ కరెస్పాండంట్ గుజ్జెటి వెంకటేష్ తెలియజేశారు. ఈ ప్రతిష్టాత్మక అవార్డును లీడ్ సీఈఓ సుమిత్ మెహ్తా ,లీడ్ జోనల్ హెడ్ శ్రీకాంత్, ఏఈఏం ఐశ్వర్య చేతుల మీదుగా స్వీకరించడం గౌరవంగా భావిస్తున్నామని తెలియజేశారు.

ఈ విజయానికి ప్రధాన కారణం కేపీఎస్ బోధనా సిబ్బంది చేసిన కృషి, అంకితభావం, లీడ్ పద్ధతులను సమర్థవంతంగా అమలు చేయడమే అని దీని ఫలితంగా విద్యార్థుల అభ్యాస నైపుణ్యాలు, విద్యా ప్రగతి మరియు ఉత్పాదక లెర్నింగ్ అవుట్‌కమ్స్ గణనీయంగా మెరుగుపడ్డాయనీ కేపీఎస్ కరస్పాండెంట్ గుజ్జేటి వెంకటేష్ తెలియజేశారు. ఈ అవార్డు కేపీఎస్ విద్యా ప్రస్థానంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచి, భవిష్యత్తులో మరింత ఉన్నత లక్ష్యాలను చేరుకునేందుకు ప్రేరణగా నిలుస్తుంది. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులకు హృదయపూర్వక అభినందనలు తెలియజేసారు.

Leave A Reply

Your email address will not be published.