Take a fresh look at your lifestyle.

నాగర్‌కర్నూల్ జిల్లా తాడూరు మండలం యంగంపల్లిలో విషాదం వడదెబ్బతో ఎలక్ట్రిషియన్ అంజనేయులు మృతి

ముద్ర ప్రతినిధి, నాగర్‌కర్నూల్:
నాగర్‌కర్నూల్ జిల్లా తాడూరు మండలం యంగంపల్లి గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. వడదెబ్బకు గురై ఎలక్ట్రిషియన్ అంజనేయులు మృతి చెందారు.
స్థానికుల వివరాల ప్రకారం, అంజనేయులు రోజంతా ఎండలో పని చేసి ఇంటికి చేరిన అనంతరం అస్వస్థతకు గురయ్యారు. అనంతరం చల్లని నీటితో స్నానం చేసిన తర్వాత ఆయన ఆరోగ్యం మరింత విషమించింది.
అతని పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు వెంటనే జిల్లా ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రికి చేరుకునేలోపే అంజనేయులు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
ఈ ఘటనతో మృతుడి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొనగా, గ్రామంలో కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి.

Leave A Reply

Your email address will not be published.