Take a fresh look at your lifestyle.

హనుమాన్ దీక్షపరుల ఆధ్వర్యంలో అన్నదానం

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాల మండలం లక్ష్మీపూర్ గ్రామంలో హనుమాన్ దీక్షపరుల ఆధ్వర్యంలో గ్రామస్తులకు మంగళవారం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.హనుమాన్ జయంతిని పురస్కరించుకొని గ్రామానికి చెందిన సుమారు 100 మంది భక్తులు హనుమాన్ దీక్షలను స్వీకరించారు.దీక్షల ముగింపు సందర్భంగా చివరి మంగళవారం హనుమాన్ దీక్ష పరుల ఆధ్వర్యంలో గ్రామస్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మానవసేవయే మాధవ సేవగా భావించి భగవంతుని ప్రసాదంగా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు దీక్షపరులు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.