Take a fresh look at your lifestyle.

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాకు 28 కొత్త కోర్టులు: బార్ అసోసియేషన్ అధ్యక్షులు నేవూరి అమరేందర్ రెడ్డి

కుషాయిగూడ , ముద్ర విలేఖరి: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాకు 28 కొత్త కోర్టులను తెలంగాణ ప్రభుత్వం మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నేవూరి అమరేందర్ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో కుషాయిగూడ లోని జిల్లా కోర్టు సముదాయంలో 2 ఫ్యామిలీ కోర్టులు, 2 అదనపు జిల్లా కోర్టులు, 4 అదనపు మెజిస్ట్రేట్ కోర్టులు మంజూరైనట్లు తెలిపారు. జిల్లాలో కొత్త కోర్టుల ఏర్పాటుకు గత ఏడాదికాలంగా బార్ అసోసియేషన్ చేసిన కృషికి ఫలితం దక్కిందని ఆయన పేర్కొన్నారు. ఇక కొత్త కోర్టులను మంజూరు చేసిన తెలంగాణ ప్రభుత్వానికి, ఉన్నత న్యాయస్థానానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.