Take a fresh look at your lifestyle.

నన్ను నిద్ర లేపితే.. బావ, బావమరిదికి చుక్కలే

  • మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత్ రావు హెచ్చరిక

ముద్ర ప్రతినిధి, మెదక్: మైనంపల్లిని నిద్ర లేపితే..బావ, బావమరిదికి చుక్కలు చూపిస్తానని మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ నాయకులు మైనంపల్లి హన్మంత్ రావు హెచ్చరించారు. గురువారం మెదక్ లో మీడియతో మాట్లాడారు.ఆంధ్రా, తెలంగాణ ఫీలింగ్ తెస్తే ఊరుకోమన్నారు. బీఆర్ఎస్ దుకాణం బంద్ అయ్యిందన్నారు. మైనంపల్లిని నిద్ర లేపితే బావా బావమరిదికి చుక్కలు చూపిస్తా అని మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు మళ్ళా ఆంధ్ర, తెలంగాణ ఫీలింగ్ తెస్తున్నారని మండిపడ్డారు. బిఆర్ఎస్ ను వీడి సర్పంచ్ లు, ఎంపిటిసిలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. ఈనెల 19న కూడా భారీగా గాంధీ భవన్ లో పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయన్నారు. మైనంపల్లిని ఎదుర్కోవాలంటే ఫీల్డ్ లోకి రావాలన్నారు. కులం, మతం ఫీలింగ్ తమకు లేదని, పిచ్చి పిచ్చిగా చేస్తే ఏరెస్తామన్నారు. మీడియా సంస్థలు, న్యూస్ ఛానెల్ ఆఫీస్ ల పై బిఆర్ఎస్ నేతలు దాడులకు తెగబడుతున్నారని, మేం దాడులకు పాల్పడితే ఊహించుకోలేరని హెచ్చరించారు. టిన్యూస్, నమస్తే తెలంగాణ పైన దాడి చేస్తామని, తట్టుకునే పరిస్థితి ఉందని కీలక వ్యాఖ్యలు చేశారు. వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు చంద్రపాల్, బొజ్జ పవన్, అరుణార్తి వెంకటరమణ, ఉప్పల రాజేష్, రాగి అశోక్ తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.