Take a fresh look at your lifestyle.

అక్రమ కట్టడాలఫై శాఖపరమైన చర్యలు తీసుకోవాలి

  • జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్.

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాల అర్బన్ లో ఎల్ ఎల్ గార్డెన్ వెనకాల 27వ వార్డు నాలా సమస్యలను జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ పరిశీలించారు. వాటర్ సరిగా వెళ్తుందా లేదా తెలుసుకొని ఇల్లీగల్, అక్రమ కట్టడాలు ఉన్నట్లయితే కోర్టు ద్వారా నోటీసులు జారీ చేసి చర్యలు తీసుకోవాలని నీటిపారుదల, రెవెన్యూ శాఖ అధికారులకు కలెక్టర్ ఆదేశించారు. అనంతరం జగిత్యాల అర్బన్ మున్సిపాలిటీ పరిధిలో డ్రైవ్ క్లీనింగ్ శానిటేషన్ లో భాగంగా పట్టణంలో విస్తృతంగా పర్యటించారు. ధరూర్ క్యాంప్ రామాలయం దగ్గర మేజర్ జంక్షన్ నాల లు ఎప్పటికప్పుడు క్లీనింగ్ చేయాలని సూచించారు. ధరూర్ కెనాల్ దగ్గర రోడ్ ప్రమోషన్ అయిన దానిని పరిశీలించి ఇరిగేషన్ అధికారులకు ఆదేశించారు. చింతకుంట చెరువు వాటర్ బయటకు వెళ్ళుట కొరకు నాలా లు మరియు రాజీవ్ చౌరస్తా కూడలిలో పరిశీలించారు డ్రైనేజీ లలో చెట్లు ముళ్ళ పొదలు, వేస్టేజ్ ఎప్పటికప్పుడు క్లీనింగ్ గా ఉంచుకోవాలని అధికారులకు ఆదేశించారు. జగిత్యాల మునిసిపాలిటీలో 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక కింద నగరంలో వ్యర్థ నివారణ, డ్రెయిన్‌లు, వాగులు, ప్రభుత్వ భూముల శుభ్రపరిచే పనులను త్వరితగతిన పూర్తి చేయాలని తెలిపారు. రామాలయం పక్కన ఉన్న ప్రభుత్వభూములు 18వ వార్డు పెద్ద నాలా, ఎస్ ఆర్ ఎస్పి కాలువ వద్ద 1వ వార్డు, శంకులపల్లి 14వ వార్డు, సోడా సెంటర్ ప్రాంతాల్లో ప్రధానంగా డ్రెయిన్‌లు, వాగులు, కలుషిత ప్రాంతాలను శుభ్రపరచడం కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. ఈ కార్యక్రమాలను డ్రైవ్ మోడ్‌లో తీసుకోవాలని, మునిసిపల్, నీటిపారుదల, రెవెన్యూ శాఖల మధ్య సమన్వయం కావాలని ఆదేశించారు. ప్రైవేట్ భూముల యజమానులు తమ భూముల్లోని ముల్ల చెట్ల పొదలు తొలగించకపోతే, జరిమానాలు విధించి, ఆ మొత్తం డబ్బుతో శుభ్రత పనులు చేపట్టాలని సూచించారు. ఈ పనుల్లో అధికారులు అత్యంత చురుకుగా పాల్గొనాలని, ప్రజలకు కనిపించేలా పర్యావరణ పరిశుభ్రత కనిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట జగిత్యాల్ రెవెన్యూ డివిజనల్ అధికారి మధుసూదన్, జగిత్యాలమున్సిపల్ కమిషనర్ స్పందన, నీటిపారుదల శాఖ ఖాన్, జగిత్యాల అర్బన్ ఎమ్మార్వో రామ్మోహన్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.