Take a fresh look at your lifestyle.

సృష్టిలో మహిళా స్థానం గొప్పది -భృంగీ విద్యా సంస్థల కార్యదర్శి ప్రమీల

 ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి :

సృష్టిలో మహిళ స్థానం ఎంతో గొప్పదని, ఆమె లేని సమాజాన్ని ఊహించలేమని భృంగీ విద్యా సంస్థల కార్యదర్శి ప్రమీల అన్నారు. శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని భృంగీ విద్యాసంస్థలో హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యాసంస్థల కార్యదర్శి ప్రమీల,


డాక్టర్ చంద్రప్రియ మాట్లాడుతూ ఇది కేవలం ఒక రోజు కాదు, సమాజంలో మహిళల శ్రమ, త్యాగం వారి గొప్పతనాన్ని గుర్తించే ఒక గొప్ప సందర్భమని, స్త్రీ లేకపోతే జననం లేదు, స్త్రీ లేకపోతే గమనం లేదు, స్త్రీ లేకపోతే సృష్టిలో జీవం లేదు. సృష్టిలో స్త్రీ ప్రాధాన్యత గురించి అన్నట్లు మహిళ లేని సమాజాన్ని మనం ఊహించలేమన్నారు. తల్లిగా, సోదరిగా, భార్యగా, కుమార్తెగా కుటుంబానికి వెన్నుముకగా నిలవడమే కాకుండా, విద్య, వైద్యం, వ్యాపారం, అంతరిక్షం, రాజకీయం ఇలా అన్ని రంగాలలో మహిళలు తమ ప్రతిభను నిరూపించుకుంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ కుమారస్వామి, శివప్రసాద్, డాక్టర్లు సందీప్ తేజ, వైభవ్, వైశ్నవి, అజయ్ అధ్యాపకులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.