ముద్ర ప్రతినిధి, నిర్మల్:
మౌళిక వసతుల కల్పనలో ఎటువంటి లోపాలు లేకుండా చూడాలని నిర్మల్ మున్సిపల్ వైస్ ఛైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి అన్నారు. నిర్మల్ మున్సిపల్ బడ్జెట్ సమావేశం వైస్ ఛైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి అధ్యక్షతన జరిగింది ఈ మేరకు ఆయన మాట్లాడుతూ పట్టణంలో మౌలిక వసతుల ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఈ బడ్జెట్ సమావేశం లో పురపాలక సంఘానికి వచ్చే ఆదాయ వ్యయాలపై చర్చ జరిపారు. 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌పై చర్చలు జరిపారు. పట్టణ అభివృద్ధి, మౌలిక వసతులు, శానిటేషన్, పారిశుధ్యం, డ్రైనేజి, రహదారుల నిర్మాణం, తాగునీటి సరఫరా వంటి అంశాలపై ప్రధానంగా చర్చించారు.