ముద్ర ప్రతినిధి, భువనగిరి :
మున్సిపల్ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారుల పాత్ర ముఖ్యమైనదని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు.
శుక్రవారం 2వ సాధారణ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఆలేరు మున్సిపాలిటీ పరిధిలోని జిల్లా పరిషత్ హై స్కూల్ లో పి ఓ , ఏ.పి.ఓ శిక్షణ తరగతులలో , యాదగిరిగుట్ట మున్సిపాలిటీ పరిధిలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో పి ఓ, ఏ .పి.ఓ ల శిక్షణ తరగతులలో పాల్గొన్న జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన మార్గదర్శకాలు తూ.చా తప్పకుండా పాటించాలన్నారు. ఎన్నికల విధుల్లో ఎలాంటి పొరపాట్లు జరగకుండా పూర్తి అవగాహనతో, బాధ్యతాయుతంగా పని చేయాలని తెలిపారు. ప్రిసైడింగ్ అధికారులు చాలా జాగ్రతగా ఎన్నికల ప్రక్రియ చేపట్టాలన్నారు. పోలింగ్ సామాగ్రిని ఉదయం 8 గంటల వరకు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ లో ఉండాలన్నారు. పోలింగ్ సామగ్రి అన్ని ఉన్నాయా లేవా అని పరిశీలించుకోవాలన్నారు. సంబంధిత పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన బ్యాలెట్ పేపర్ వచ్చాయా లేదా చెక్ చేసుకోవాలని తెలిపారు. బ్యాలెట్ బాక్సులు సులభంగా ఓపెన్ అవుతున్నాయ లేదా అని ముందస్తుగానే చెక్ చేసుకోవాలన్నారు. స్వస్తిక్ గుర్తు, మున్సిపాలిటీలకు సంబంధించిన స్టాంపులు అన్ని వచ్చాయ లేదా చూసుకోవాలని సూచించారు. పోలింగ్ కేంద్రంలో ప్రతి ఒక్క ఓటరు తన ఓటును బ్యాలెట్ బాక్సులో వేస్తున్నారా లేదా అని పర్యవేక్షించాలన్నారు. పోలింగ్ రోజున సమయపాలన పాటించడంతోపాటు ఓటర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు చేపట్టాలన్నారు. పోలింగ్ ప్రకియ ముగిసిన తర్వాత మళ్లీ పోలింగ్ సామగ్రిని జాగ్రత్తగా తీసుకోవాలి రిసెప్షన్ కౌంటర్ లలో అప్పగించాలని తెలిపారు. ప్రతి పి .ఓ, ఏ.పి.ఓ అధికారి తన బాధ్యతను సమర్ధంగా నిర్వర్తించి ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు సహకరించాలన్నారు.
ఈ శిక్షణా కార్యక్రమంలో ఆర్డీవో కృష్ణారెడ్డి, గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారి నాగిరెడ్డి,మున్సిపల్ కమిషనర్లు, తాసిల్దార్లు, పి.ఓ లు, ఏపీవోలు పాల్గొన్నారు.
Naresh is a Asst Editor and he is working with our organisation and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Prev Post
పాలమూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ని డివిజన్ లో ప్రచారం చేస్తున్న మంత్రి దామోదర రాజానర్సింహా
Next Post