ముద్ర : కాప్రా
మల్కాజిగిరి మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కృష్ణ రెడ్డి ని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా స్థానిక సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.
ప్రజా సమస్యల పరిష్కారం, మౌలిక వసతుల అభివృద్ధి, పారిశుద్ధ్య కార్యక్రమాల వేగవంతం వంటి అంశాలపై అధికారులు ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని కమిషనర్ ను ఎమ్మెల్యే కోరారు . కమిషనర్ వినయ్ కృష్ణ రెడ్డి కూడా అభివృద్ధి పనులను వేగవంతం చేస్తామని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు, కుమార స్వామి, ఎస్.ఏ. రహీమ్, మురళి పంతులు, వంజరి ప్రవీణ్, శంకర్ బాబు, తదితరులు పాల్గొన్నారు.